సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిలా ప్రధాన కార్యదర్శి అంజాద్ పాషా మాట్లాడారు. జిల్లా కేంద్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించి షరతులు లేకుండా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకుండా అడ్డుపడుతూ ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ రేటుకు అమ్ముకునే విధంగా చూస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, కొమరయ్య, పైడయ్య పాల్గొన్నారు.


