‘ఎస్సారెస్పీ కాల్వకు నర్సింహారెడ్డి పేరు పెట్టాలి’
ములుగు రూరల్: సాయుధ పోరాటయోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరును రెండోదశ ఎస్సారెస్పీ కాల్వకు పెట్టాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి చంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం మల్లంపల్లిలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణలో తాగునీరు, సాగునీరు కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సాగు, తాగునీటి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సారెస్పీ రెండో కాల్వకు శంకుస్థాపన చేయించారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, శ్రీనాధ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: యూపీఎస్‌సీ, సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే అభ్యర్థులు ఉచిత ఓరియంటేషన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నరేష్ వి.పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9వ తేదీల్లో యూపీఎస్‌సీ, సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు క్యూఆర్‌కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 8వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు, 3.30 నుంచి 5 గంటల వరకు క్లాస్‌లు ఉంటాయని వివరించారు. పూర్తి వివరాలకు 9811394456, 9643415946, 8745821596 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మల్హర్: మిర్చి పంటలో నిల్వ ఉన్న నీటిని తొలగించి పంట రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్‌కుమార్ అన్నారు. మండలంలోని తాడిచర్ల ఎర్రగుంట శివారులో నీట మునిగిన మిరప తోటలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. తోటల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు వెళ్లేలా గుంటలు, కాల్వలు తవ్వి డ్రెయినేజీ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధిక తేమ కారణంగా వేరు కు ళ్లు తెగులు వచ్చే అవకాశముందని, నీరు తగ్గిన వెంటనే ట్రైకోడెర్మా విరైడే లేదా ప్సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మందును పిచికారీ చేయాలని సూచించారు. మిరప మొక్కల పునరుద్ధరణ చర్యలకు నీరు తగ్గిన తర్వాత, మొక్కలు తిరిగి పుంజుకునేందుకు హ్యూ మిక్ యాసిడ్ లేదా అమినో యాసిడ్ 3 మిల్లీ లీట ర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.
‘ఎస్సారెస్పీ కాల్వకు నర్సింహారెడ్డి పేరు పెట్టాలి’


