గుట్టలెక్కి వైద్యసేవలు
వాజేడు: మండల పరిధిలోని గుట్టలపైనున్న పెనుగోలు గ్రామానికి హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు ఎంతో కష్టపడి వెళ్లి వైద్య పరీక్షలు చేయడంతో పాటు దోమలమందు పిచికారీ చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. పెనుగోలు కాలనీ వాసులు గోపి, ముద్దయ్యల సహకారంతో వెంకటేశ్వర్లు మంగళవారం కాలినడకన 18 కిలో మీటర్ల మేర గుట్టపైకి నడిచి వెళ్లాడు. ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న మూడు వాగులు ఉండగా మోకాలు లోతు నీటిలో నుంచి నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఉన్న 10 ఇళ్లలో హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు దోమల మందు పిచికారీ చేయించి, 25 మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. అందులో ఉయిక సమ్మయ్య, సత్యంలకు మలేరియా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వారిద్దరికి మంగళవారం, బుధవారం వైద్యం చేసి 18కిలో మీటర్లు నడుచుకుంటూ మళ్లీ గుట్ట దిగి వైద్యశాలకు వచ్చాడు. ఈ సందర్భంగా పెనుగోలు వాసులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.
18కిలో మీటర్లు కాలినడకన వెళ్లి సేవలు
గుట్టలెక్కి వైద్యసేవలు


