ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
● ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్
ములుగు రూరల్: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థు ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో ప్రై వేట్ కళాశాలలు బంద్ పాటిస్తున్నాయని వెల్లడించారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని వివరించారు. చదువు పూర్తి అయిన విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయ ని పక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవితేజ, బలీశ్వర్, జస్వంత్, భాను, రాకేష్, భరత్, సురేశ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


