కుటీర పరిశ్రమపై పట్టింపేది?
యూనిట్‌తో ఉపయోగాలు
న్యూట్రి, డ్రైమిక్స్ తయారీ యూనిట్‌లో శిథిలమవుతున్న మిషనరీ
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఐటీడీఏ గిరిజన మహిళా సంఘాలతో రూ.39 లక్షలతో న్యూట్రి, డ్రైమిక్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. ఇందులో 60 శాతం సబ్సిడీ పోగా 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతం బెనిఫిషరీ వాటాతో 2022లో నెలకొల్పింది. ఇప్పపువ్వుతో పాటు జొన్న, రాగులు, ఇతర పోషకాలతో కూడిన ఆహార పదార్థాలతో లడ్డూలు తయారు చేసి జీసీసీ ద్వారా ఐటీడీఏ పరిధిలోని గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేసి వచ్చే ఆదాయంతో గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించేలా శ్రీకారం చుట్టారు. కానీ ఈ యూనిట్‌ను ఏడాది మాత్రమే నడిపించి చేతుల ఎత్తేశారు.
ముడిసరుకు తేవడంలో విఫలం
జోహర్ మిల్ పేరుతో పోషకాహార పదార్థాలు తయారు చేసేందుకు కావాల్సిన ముడి సరుకును తేవడంలో ఇటు నిర్వాహకులు, అటు ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు. పెద్ద ఎత్తున మిషనరీని ఏర్పాటు చేసి కేవలం ఏడాది మాత్రమే ఉత్పత్తిని తీశారు. ఆ తర్వాత లాభాలు రావడం లేదని, కావాల్సిన ముడి సరుకు అందడం లేదని దానిని ఒదిలేశారు. ఈ విషయం ఐటీడీఏ అధికారులకు తెలిసినప్పటికీ దానిని తెరిపించే ప్రయత్నం చేయడం లేదు. ఈ యూనిట్ విషయం గురించి స్వయంకృషి జాయింట్ లియబిలిటీ గ్రూపు సభ్యులను పిలిపించి మాట్లాడే ప్రయత్నాన్ని కూడా ఐటీడీఏ అధికారులు చేయకపోవడం గమనిస్తే అధికారుల నిర్లక్ష్యం అర్ధం అవుతుంది.
యూనిట్ సక్రమంగా నడిపితే 10 మంది గిరిజన మహిళలకు ఉపాధి లభిస్తుంది. దీంతో వారి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనిని పక్కన పెట్టడంతో ఇటు ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోవడమే కాకుండా పది మందికి ఉపాధి లేకుండా పోయింది. అంతేకాకుండా గిరిజన విద్యార్థులకు సరైన పోషకాలు అందించడానికి యూనిట్ ఉపయోగపడుతుందని పరిగణించారు. కాని ఇప్పుడు కేవలం మార్కెట్‌లో లభించే నాణ్యతలేని ఫుడ్‌నే విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితి.
తయారీదారుల పట్టింపులేని తనం
ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం
రూ.39 లక్షల యూనిట్ నిరుపయోగం
కుటీర పరిశ్రమపై పట్టింపేది?
కుటీర పరిశ్రమపై పట్టింపేది?


