‘మీ సేవ’ పాత్ర కీలకం
ములుగు రూరల్: డిజిటల్ తెలంగాణలో మీసేవ పాత్ర కీలకమని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు మీసేవ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మీసేవ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి 14ఏళ్లు పూర్తి చేసుకున్నాయని వివరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు డిజిటల్ సేవలు పారదర్శకంగా, సులభతరంగా సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. మీ సేవ కేంద్రాల ద్వారా 32 డిపార్ట్‌మెంట్‌ల నుంచి 400 పైగా సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు. టీయాప్, టీ వాలెట్ మొబైల్ యాప్‌ల ద్వారా మీసేవ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 55 మీసేవ కేంద్రాలు 174 గ్రామాలకు డిజిటల్ సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటీస్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఈ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10 ఐటీఐలో జరిగే అప్రెంటీస్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.
కన్నాయిగూడెం: మండల పరిధిలోని కంతనపల్లి గ్రామ రైతులకు మంగళవారం ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ భూసార పరీక్ష పత్రాలను అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ వీసీలో ఆయిల్ పామ్, పంటసాగు వివరాలు, భూ సార పరీక్ష పత్రాల ఆవిశ్యకతను వివరించారు. ఈ కార్యక్మంలో మండల వ్యవసాయ అధికారి మహేశ్, ఏఈవోలు కల్యాణి, ప్రియాంక తదితరులు పాల్గొన్నరు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారితక్ర రామప్ప దేవాలయాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎరిక్, లూయిస్‌లు మంగళవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు.
‘మీ సేవ’ పాత్ర కీలకం
‘మీ సేవ’ పాత్ర కీలకం


