పైపులైన్ కల్వర్టుల నిర్మాణం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం– తాడ్వాయి మధ్యలో డిప్పులు (రోడ్డు కిందకు) ఉన్న చోట్ల పైపులైన్ కల్వర్టు నిర్మాణం పనులు సాగుతున్నాయి. రూ. 96 లక్షలతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో పైపులైన్ కల్వర్టు నిర్మాణం పనులను చేపట్టారు. ఈ మేరకు తాడ్వాయి మీదుగా మేడారానికి మహాజాతర సమయంలో వేలాది మంది భక్తులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్తుంటారు. ఈ రోడ్డు మార్గంలో నాలుగైదు చోట్ల డిప్పులు ఉన్న ప్రదేశంలో వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. వీటిని గుర్తించిన అధికారులు ప్రమాదాలు జరగకుండా పైపులైన్ కల్వర్టులు నిర్మిస్తున్నారు. డిప్పులు ఉన్న ప్రాంతంలో పైపులైన్ కల్వర్టులు నిర్మించడంతో రోడ్డు ఎత్తు ఫలాలు సమాంతరంగా ఉండడంతో మేడారానికి వాహనాలు సాఫిగా వెళ్లనున్నాయి.


