ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించాలి

Oct 30 2025 7:43 AM | Updated on Oct 30 2025 7:43 AM

ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించాలి

ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించాలి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మెనూ తప్పనిసరిగా పాటించాలని వార్డెన్లను ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా ఆదేశించారు. మండల పరిధిలోని ఊరట్టం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను, గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్‌నగర్‌, కర్లపల్లిలోని ఆశ్రమ పాఠశాలలను పీఓ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని టాయిలెట్లు, నీటి సరఫరా, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు, ఫ్యాన్లు, డ్రైయినేజీ, నీటి ఎద్దడి సమస్యలపై సంబంధిత వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ తుపాను కారణంగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు విద్యుత్‌ స్తంభాలకు తగలకుండా చూడాలని సూచించారు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్లొద్దని వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై వైద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏఎన్‌ఎంలు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు ఖచ్చితంగా మెనూను పాటించాలని పీఓ అధికారులకు తెలిపారు.

ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement