ఛత్తీస్‌గఢ్ నుంచి ధాన్యం రాకుండా చర్యలు
వాజేడు: పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని చెరుకూరు గ్రామం వద్ద 163 నంబర్ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోని ధాన్యం రాకుండా సంబంధిత అధికారులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఏఈవో హరీశ్, చెక్‌పోస్టు సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాంపతి, సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ కుమార స్వామి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ


