అధికారులు అప్రమత్తం ఉండాలి
ములుగు రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర బుధవారం టెలికాన్పరెన్స్ ద్వారా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను కారణంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైతే వెంటనే బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వివరించారు.
జాతీయస్థాయి
క్రీడాపోటీలకు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి స్టాలిన్‌నాయక్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుత్నున స్టాలిన్‌నాయక్ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్‌లో, క్రాస్ కౌంట్రీ రేస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎన్నికై నట్లు వెల్లడించారు. 2026 ఫిబ్రవరిలో హరియాణాలోని రోహతక్‌లో జరిగే పోటీలో పాల్గొననున్నట్లు ఇన్‌చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తెలిపారు.
సింగరేణి జీఎంపై
విమర్శలు సరికావు
భూపాలపల్లి అర్బన్: ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్‌పై బార్ అసోసియేషన్ విమర్శలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ ఆరోపించా రు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమ ఫండ్‌తో నిర్మించిన భవనాలు కేవలం కార్మికుల అవసరాలకు మాత్రమే వాడుకోవా ల్సి ఉందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కమ్యూనిటీహాల్‌ను కోర్టు ఏర్పాటుకు అప్పగించవద్దన్నా రు. జీఎం బార్ అసోసియేషన్ నాయకులు అనుచిత వాఖ్యలు చేయడం ప్రభుత్వ శాఖల అధికారులను కించపర్చినట్లే అన్నారు. ఇప్పటికే పలు భవనాలు, క్వార్టర్లు ప్రభుత్వం స్వాఽ దీనం చేసుకొని అధికారులు, సిబ్బందికి కేటా యించినట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యాన్ని కించపర్చినట్లు మాట్లాడడం హేయమై న చర్య అని అన్నారు. సమావేశంలో నాయకులు మధుకర్‌రెడ్డి, బుచ్చయ్య, రఘుపతిరెడ్డి, సమ్మిరెడ్డి, అశోక్, హుస్సేన్ పాల్గొన్నారు.
శభాష్.. విద్యుత్ ఉద్యోగులు
భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు డీసీసీ బ్యాంకు వద్ద ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులు బుధవారం రాత్రి వర్షంలోనూ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి సరఫరా పునరుద్ధరించారు. దీంతో పట్టణవాసులు, వ్యాపారులు తదితరులు.. విద్యుత్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. లైన్‌మన్ దేవేందర్‌రెడ్డి, ఏఎల్‌ఎంలు మహేష్, రవి, ఉమాన్ ఉన్నారు.
అధికారులు అప్రమత్తం ఉండాలి
అధికారులు అప్రమత్తం ఉండాలి


