మరింత శక్తివంతంగా..
జిల్లాలో మహిళా సంఘాల వివరాలు...
మహిళా సంఘాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి
మహిళా సాధికారతే లక్ష్యం
భూపాలపల్లి రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో వారికోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలతో కొత్తగా మహిళా సంఘం గ్రూపులు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ బ్యాంక్ రుణాలు అందించేలా కృషి చేస్తున్నారు. గతంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు 60 ఏళ్లు దాటితే వారిని గ్రూపులోంచి తొలగించేవారు. ప్రస్తుతం ఉన్నవారిని అలాగే ఉంచాలని, లేకుంటే వారికి ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందుకుతగిన చర్యలు చేపడుతున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల ఆనందం..
గతంలో 60 ఏళ్లు దాటాయంటే మహిళలను గ్రూపు నుంచి తొలగించేవారు. దీంతో వారు పొదుపు చేసుకునే అవకాశం ఉండేదికాదు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందించే పథకాలు వర్తించేవి కాదు. తాజాగా ప్రభుత్వం కచ్ఛితంగా వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని ఆదేశించడంతో ఆదిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రా మ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితో పాటు 15 నుంచి 18 ఏళ్ల మధ్య బాలికలతో కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు, సామాజిక మాద్యమాల ద్వారా మోసాలు, అత్యాచారాలు, ఇతరత్రా అంశాలపై వారికి చై తన్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దివ్యాంగుల కోసం సైతం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 12 మంది ఉంటే వారికి ఒక గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. వీరందరికీ బ్యాంక్ రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రత్యేక కార్యాచరణతో రుణాలు..
ఈనెల 12వ తేదీనుంచి 14వ తేదీ వరకు గ్రామాల వారీగా జాబితా రూపొందించి మహిళా సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, బాలికలను గుర్తించారు. 56 నూతన మహిళ (వృద్ధులు)లను సంఘాలు 449 సభ్యులుగా చేర్చారు. అదేవిధంగా 24 దివ్యాంగుల సంఘాల్లో 67 మంది సభ్యులను చేర్చారు. వారికి సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనం గురించి వివరించారు. సంఘాల్లో చేరిన సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసి, వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందించనున్నారు.
మండలం సంఘాలు సభ్యులు
భూపాలపల్లి 787 8,162
చిట్యాల 799 8,215
గణపురం 802 8,365
కాటారం 865 8,787
మహదేవపూర్ 752 7,722
మల్హర్‌రావు 690 7,060
మొగుళ్లపల్లి 809 8,640
మహాముత్తారం 663 6,716
పలిమెల 169 1,753
రేగొండ 1,201 13,590
టేకుమట్ల 602 6,176
మొత్తం 8,139 85,186
వృద్ధులు దివ్యాంగులు, కిశోర బాలికలతో గ్రూపుల ఏర్పాటు
బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు
యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్న అధికారులు
జిల్లాలో మహిళా సమాఖ్య సంఘాలు 8,139
సంఘాల్లో సభ్యులు 85,186 మంది
మహిళలు సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో నూతనంగా వృద్ధులు, దివ్యాంగులు, బాలికలకు అవకాశం కల్పిస్తున్నాం. వారికి ఇప్పటికే అవగాహన కల్పించాం. వీరికి బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు కూడా అందజేసి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సహకరిస్తాం.
– బాలకృష్ణ, డీఆర్డీఓ భూపాలపల్లి
మరింత శక్తివంతంగా..


