
వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి
ములుగు రూరల్: చిన్నారులకు సకాలంలో తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని జంగాలపల్లి ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విపిన్‌కుమార్ మాట్లాడుతూ టీకాల ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. టీకాల వివరాలను యువిన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకా డ్యూలిస్టు ఇచ్చిన అనంతరం ఎంసీహెచ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రణధీర్, పోషకాహార జిల్లా ప్రోగ్రామ్ అధికారి శ్రీకాంత్, డెమో సంపత్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం: హాస్టల్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. గిరిజన హాస్టల్ వర్కర్ల సమ్మె 42వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం కొమురం భీమ్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 42రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గతంలో వస్తున్న వేతనాలను తగ్గిస్తూ జీవో నంబర్ 64ను తీసుకురావడం కార్మికులకు శాపంగా మారిందన్నారు. ఆ జీవోను తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ. దావూద్, నాగలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, సతీస్, రాజు, బాలు తదితరులు ఉన్నారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన క్రీడాకారుడు సున్నం చరణ్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని పటాన్‌చెరువులో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 17 వాలీబాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి వరంగల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. జట్టు తరఫున ఆడిన చరణ్ అత్యంత ప్రతిభ కనబర్చడంతో సెలక్షన్ కమిటీ సభ్యులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ జైపాల్, పేట సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న చరణ్‌ను ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, ఉపాధ్యాయులు అభినందించారు.
పోలీస్‌స్టేషన్‌లో
ఓపెన్ హౌస్
భూపాలపల్లి అర్బన్: పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు పోలీసుల విధులు, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ఫింగర్ ప్రింట్స్ కమ్యూనికేషన్‌ల గురించి వివరించారు. విద్యార్థులకు చెడు వ్యసనాలకు గురికావొద్దని సీఐ నరేష్‌కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి

వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి