
సాగు, తాగునీరేది?
మండలాల వారీగా
భూగర్భ జలాలు (మీటర్లలో..)
తలాపున గోదావరి..
తుపాకులగూడెం వద్ద గోదావరి ఉధృతి(ఫైల్)
ఏటూరునాగారం: జిల్లాలో గోదావరి 110 కిలో మీటర్ల మేర ప్రవహిస్తోంది. కానీ సాగు, తాగునీటి కోసం ప్రజలు నేటికీ కష్టాలు పడుతూనే ఉన్నారు. చేతి పంపుల ద్వారా దాహార్తిని తీర్చుకుంటున్నారు. వర్షాకాలంలో ఎన్ని వర్షాలు కురిసిన, గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పటికీ భూగర్భ జలాలు పెరగడం లేదు. జిల్లాలో దేవాదుల, సమ్మక్క బ్యారేజీలు ఉన్నప్పటికీ వాటితో ఉపయోగం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు.
నీటి నిల్వలు ఇతర ప్రాంతాలకు..
జిల్లాలో గోదావరి కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నప్పటికీ నీటి నిల్వల ఎగుమతులు ఇతర జిల్లాలకు తరలించడం గత ప్రభుత్వ పాలకుల మోసంగా పరిగణించవచ్చు. దేవాదుల, తుపాలకుగూడెం ప్రాజెక్టు పరిధిలోని నీటి లభ్యత అంతా కూడా కరీంనగర్, భూపాలపల్లి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారే తప్పా జిల్లా ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమిలేదు. తుపాకులగూడెంలో 6 టీఎంసీల నీటి నిల్వలు కేవలం దేవాదుల కోసమే.. ఆ నీటిని సైతం పంపింగ్ చేసి ఇతర జిల్లాలకు తరలించడంతో జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు కష్టాలుగానే ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
చెరువులకు అనుసంధానం చేయాలి..
సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఎత్తిపోతల పథకం కింద జిల్లాలోని చెరువులు, సరస్సులకు అనుసంధానం చేయాలి. వాటిని నిత్యం నీటితో నింపాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై అప్పటి కలెక్టర్ మురళీ సమ్మక్క బ్యారేజీకి గ్రావిటీ కాల్వలు తవ్వించి నీటి నిల్వల సౌకర్యం కల్పించాలని అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. అవి ఆచరణలోకి రాలేదు.
ఏటూరునాగారం 20
మంగపేట 19
కన్నాయిగూడెం 21
వాజేడు 23
వెంకటాపురం(కె) 24
ఎస్‌ఎస్ తాడ్వాయి 28
గోవిందరావుపేట 26
ములుగు 29
మల్లంపల్లి 27
వెంకటాపురం(ఎం) 22