
అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
వాజేడు: విద్యార్థుల్లో విద్యా అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన పలు పాఠశాలలతో పాటు కేజీబీవీని తనిఖీ చేశారు. స్వయంగా విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. కేజీబీవీలో భోజనం చేసిన అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా డీఆర్‌ని రాయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదులో వాజేడు మండలం 100శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో ఉందన్నారు. బడికి రాని పిల్లలను బడిలో చేర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ జిల్లా సమన్వయకులు కృష్ణబాబు, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ సిద్ధార్థరెడ్డి