
దళారులకు ధాన్యం విక్రయించొద్దు
ములుగు రూరల్: రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని జంగాలపల్లి, ఇంచర్ల, వెంకటాపురం(ఎం) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నాయకులు రాజేందర్‌గౌడ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి