రామాలయంలో ఆకాశదీపం | - | Sakshi
Sakshi News home page

రామాలయంలో ఆకాశదీపం

Oct 22 2025 6:43 AM | Updated on Oct 22 2025 6:43 AM

రామాలయంలో ఆకాశదీపం

రామాలయంలో ఆకాశదీపం

మలుగు రూరల్‌: విదేశాల్లో ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాని జిల్లా ఉపాధి కల్పన అధికారి తుల రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్‌ మాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత నియామక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన నైపుణ్యం గల కార్మికుల కోసం విదేశీ నియామక డ్రైవ్‌ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఉద్యోగాలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లమా, డిగ్రీ కలిగిన వారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు అనువైనవని వివరించారు. ఉద్యోగ దారులకు ఉచిత వసతి, భోజనం, బీమా సౌకర్యం కల్పిస్తారని వెల్లడించారు. రోజకు పని 8 గంటలు చేయాల్సి ఉంటుందని, అదనపు పనికి అదనపు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలని, వీసా, ప్రొసెసింగ్‌ ఖర్చులు అభ్యర్థులు వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు tomcom, resume@gmail.com కు దరఖాస్తు పంపించాలని సూచించారు.

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆకాశ దీపాన్ని అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ మంగళవారం రాత్రి వెలిగించారు. కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిరోజూ ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వెలుగుతుంది. ఈ దీపం నెల రోజుల పాటు ఉంటుందని అర్చకులు తెలిపారు. దీపాన్ని దర్శించుకోవడం వల్ల శుభం కలుగుతుందని ఆయన వివరించారు.

విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి

వెంకటాపురం(కె): మండల పరిధిలోని తిప్పాపురం గ్రామ సమీపంలో కోడి పందేలా స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై కొప్పుల తిరుపతి రావు కథనం ప్రకారం.. తిప్పాపురం గ్రామ సమీపంలో కోడిపందేలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 26 ద్విచక్రవాహనాలు, మూడు కోడి పుంజులు, 8 కత్తులతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంపూర్ణ ఆరోగ్యానికి వెల్‌నెస్‌ సెంటర్‌

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లోని విద్యార్థులకు, అధ్యాపకులకు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యానికి వెల్‌నెస్‌ సెంటర్‌ తోడ్పడుతోందని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు. నిట్‌ వరంగల్‌, బెంగుళూరు హార్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్‌ను మంగళవారం బిద్యాధర్‌ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ కిరణ్‌కుమార్‌, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన పెట్రోల్‌ అందించాలి

మల్హర్‌: వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్‌, డీజిల్‌ అందించాలని డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్‌, జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి శ్రీలత అన్నారు. విని యోగదారుల ఫిర్యాదు మేరకు మంగళవారం తాడిచర్ల హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌లో తనిఖీ చేపట్టా రు. గాలి పంపు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. పెట్రోల్‌, డీజిల్‌ నాణ్య త, వ్యత్యాసాన్ని పరిశీలించేందుకు నమూనాలను సేకరించారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్‌, సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవన్నారు. అనంతరం మల్లారం రైస్‌ మిల్లును పరిశీలించారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement