
టేకు దుంగల స్వాధీనం
ఏటూరునాగారం: ఏటూరునాగారం నుంచి వరంగల్ వైపు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను పట్టుకున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఆదివారం తెల్లవారు జామున మండల పరిధిలోని చిన్నబోయినపల్లి సమీపంలో జినాన్ పింక్ ఆప్ వాహనంలో తొమ్మిది టేకు దుంగలను పట్టుకెళ్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఆ వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేస్తుండగా డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలో ఉన్న టేకు దుంగల విలువ రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఈ దుంగలను ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నారాయణ, ఎఫ్‌బీఓ ఖాజామొద్దిన్, జ్యోతి, అనూష, బేస్ క్యాంప్ సిబ్బంది సాంబ, ప్రశాంత్, మహేశ్, నాగేంద్ర, డ్రైవర్ హరీశ్ పాల్గొన్నారు.