
రామప్పలో ఇంగ్లండ్ దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్‌కు చెందిన పర్యాటకుడు నికోలస్ సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ శిల్పకళ విశిష్టతను గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం నికోలస్ లక్ష్మీదేవిపేటలో దసరా క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలను వీక్షించారు. అమరావతి విద్యాలయం మైదానంలో జరిగిన ఫైనల్ పోటీల్లో పట్వారిపల్లి, నర్సింగాపూర్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో లక్ష్మీపురం ప్రథమ బహుమతి, నర్సింగాపూర్ ద్వితీయ బహుమతి, బూర్గుపేట తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీలు అద్భుతంగా జరిగాయని, క్రీడాకారులు బాగా రాణించారని నికోలస్ ప్రశసించారు. నర్సింగాపూర్‌కు చెందిన తన మిత్రుడి ఇంటికి వచ్చిన సందర్భంలో నికోలస్‌తో పలువురు గ్రామస్తులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు.
నీటిమునిగిన పంటల పరిశీలన
కన్నాయిగూడెం: గోదావరి వరదతో నీట మునిగి దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారి మహేశ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని గూర్రేవుల, సింగారం, బుట్టాయిగూడెం, చింతగూడెంతో పాటు ఇతర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వరి సుమారుగా 83 ఎకరాలు, మిర్చికి 180 ఎకరాల్లో నష్టం వాటిలినట్లు తెలిపారు. వీరి వెంట ఏఈఓ కల్యాణి, రైతులు ఉన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి
● సైబర్ క్రైం డీఎస్పీ నందిరాంనాయక్
ములుగు: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ నందిరాంనాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మీటింగ్ హాల్‌లో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులం అంటూ ఫోన్ చేసి వాట్సప్ ద్వారా వీడియో కాల్స్ చేసి బాధితులను డిజిటల్ అరెస్టు చేస్తారని తెలిపారు. అనంతరం గదికి వెళ్లి లాక్ చేసుకొనేలాగా భయబ్రాంతులకు గురి చేసి బ్యాంక్ వివరాలు తెలుసుకుని అకౌంట్‌లో డబ్బులు కాజేస్తారని వివరించారు. గుర్తింపులేని సంస్థలు షేర్ మార్కెట్ చేయకూడదని తెలిపారు. మొబైల్‌కు వచ్చే అనవసర మెసేజ్‌లను, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల లింక్స్, ఏపీకె ఫైల్స్ క్లిక్ చేయకూడదని తెలిపారు. సైబర్ మోసాల భారిన పడితే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వైద్యులు, సిబ్బంది, సైబర్ క్రైం సిబ్బంది పాల్గొన్నారు.

రామప్పలో ఇంగ్లండ్ దేశస్తుడు

రామప్పలో ఇంగ్లండ్ దేశస్తుడు