గోదావరి దోబూచులాట | - | Sakshi
Sakshi News home page

గోదావరి దోబూచులాట

Sep 28 2025 6:57 AM | Updated on Sep 28 2025 6:57 AM

గోదావ

గోదావరి దోబూచులాట

ధాన్యం కొనుగోళ్లలో లోపాలు ఉండొద్దు ములుగు సర్పంచ్‌ స్థానాల రిజర్వేషన్లు ఇల్లా..

న్యూస్‌రీల్‌

లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు

ములుగు రూరల్‌: జిల్లాకేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు శనివారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా భోగినేని వెంగయ్య బ్రదర్స్‌, చందా శ్రీనివాస్‌ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, బండారి మోహన్‌కుమార్‌, బాణాల రాజ్‌కుమార్‌, ఇమ్మడి రాకేష్‌యాదవ్‌, సురేందర్‌, ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మ చైర్మన్‌గా రవీందర్‌రెడ్డి

ములుగు రూరల్‌: జిల్లా ఆత్మ చైర్మన్‌గా మల్లంపలి మండలం దేవనగర్‌ గ్రామానికి చెందిన కొండ రవీందర్‌ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం సహయ సంచాలకులు వి.సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఆయనతో పాటు 22 మంది డైరెక్టర్లను నామినేట్‌ చేశారు.

కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి వేడుకలు

ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎం.సర్ధార్‌సింగ్‌ కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను కొత్త తరానికి చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అదే విధంగా ములుగు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిప్ప అశోక్‌, మాజీ అధ్యక్షుడు డీపీ జనార్ధన్‌, చేనేత సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

లొంగిపోయిన

మావోయిస్టులకు రివార్డులు

ములుగు: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఇటీవల ఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌ ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ సరెండర్‌ పాలసీలో భాగంగా తక్షణ సహాయంగా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికీ రూ.25 వేల చొప్పున వచ్చిన నగదు రివార్డును శనివారం ఎస్పీ తన కార్యాలయంలో వారికి అందజేశారు. గత మే నెలలో లొంగిపోయిన మడవి మంగ్లీ, మడకం కమలేష్‌, మడకం భీమేలకు నగదు రివార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సరెండర్‌ పాలసీని అమలు చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు డీడీ, వైద్య చికిత్స, పునరావాస సాయం అందుతుందన్నారు. లొంగిపోయిన వారు సమాజంలో స్థిరపడేందుకు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ములుగు ఇన్‌చార్జ్‌ ఓఎస్డీ రవీందర్‌, ఆర్‌ఐ తిరుపతి పాల్గొన్నారు.

ములుగు: ధాన్యం కొనుగోళ్లలో లోపాలు ఉండకూడదని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ కొనుగోలు సెంటర్ల నిర్వహకులకు సూచించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, బుక్‌ కీపర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు ఉండాలన్నారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని మాత్రమే రైస్‌ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్‌ఓ, డీఎం తదితరులు పాల్గొన్నారు.

మంగపేటలో స్థానిక ఎన్నికలకు బ్రేక్‌?

మంగపేట: జిల్లాలోని మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బ్రేక్‌ పడింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణలో భాగంగా 2023 జూలై 5న తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టీస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పు మేరకు షెడ్యూల్డ్‌ ఏరియా(ఏజెన్సీ)అమలులో ఉన్న మంగపేటలో ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఈ నెల 23న సుప్రీంకోర్టు జస్టీస్‌ మహేశ్వరి ధర్మాసనం 2023లో హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు మంగపేట మండలంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేసినట్లు సమాచారం.

జగ్గన్నపేట ఎస్టీ జనరల్‌, పత్తిపల్లి ఎస్టీ మహిళ, దేవగిరిపట్నం ఎస్టీ జనరల్‌, మదనపల్లి ఎస్సీ మహిళ, అబ్బాపూర్‌ ఎస్సీ జనరల్‌, జంగాలపల్లి బీసీ జనరల్‌, బరిగలానిపల్లి బీసీ జనరల్‌, జాకారం బీసీ మహిళ, ఇంచర్ల బీసీ జనరల్‌, కాశిందేవిపేట బీసీ మహిళ, బంజరుపల్లి జనరల్‌, పొట్లాపూర్‌ జనరల్‌ మహిళ, అంకన్నగూడెం ఎస్టీ జనరల్‌, సర్వాపూర్‌ ఎస్టీ జనరల్‌, కన్నాయిగూడెం ఎస్టీ మహిళ, రాయినిగూడె ఎస్టీ మహిళ, పెగడపల్లి ఎస్టీ జనరల్‌, కొత్తూరు ఎస్టీ జనరల్‌, పంచోత్కులపల్లి ఎస్టీ మహిళగా రిజర్వేషన్‌లు ఖరారయ్యాయి.

ఎంపీటీసీ రిజర్వేషన్‌ వివరాలు

ములుగు మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు గాను కొత్తూరు ఎస్టీ జనరల్‌, కాశిందేవిపేట ఎస్టీ మహిళ, ఇంచర్ల ఎస్టీ జనరల్‌, అబ్బాపూర్‌ బీసీ జనరల్‌, జంగాలపల్లి బీసీ జనరల్‌, జగ్గన్నపేట బీసీ మహిళ, పత్తిపల్లి బీసీ మహిళ, దేవగిరిపట్నం జనరల్‌, సర్వాపూర్‌ జనరల్‌ మహిళగా ఖరారు అయ్యాయి.

దరఖాస్తుల ఆహ్వానం

ములుగు రూరల్‌: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కొమురయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే వారికి ఈ పథకం కింద రూ.20 లక్షల ఉపకార వేతనం మంజూరు చేస్తామని వెల్ల డించారు. ఎంపికై న వారికి ఉచిత వీసా, విమాన ప్రయాణ చార్జీలు చెల్లిస్తామని తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని వివరించారు. నవంబర్‌ 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

రామప్పలో సిరియా దేశస్తులు

వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని సిరియాకు చెందిన రావద్‌, అమీన్‌లు శనివారం సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు.

వాజేడు: గోదావరి వరద పెరుగుతూ.. తగ్గుతూ దోబూచులాడుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు ఉధృతంగా పెరిగిన గోదావరి వరద శనివా రం మధ్యాహ్నం వరకు క్రమంగా తగ్గింది. 16.410 మీటర్ల వరకు పెరిగిన గోదావరి తగ్గుముఖం పట్టి 14.920 మీటర్ల వరకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి మళ్లీ వస్తున్న నీటి ప్రవాహంతో గోదావరి వరద శనివారం సాయంత్రం 6 గంటలకు 15.140 మీటర్ల మేర పెరిగింది. దీనికి తోడు మండలంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది ఎకరాల్లోని మిర్చి పంట ఇంకా నీటిలోనే మునిగి ఉంది. మండల పరిధిలోని పూసూరు వద్ద గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.

వాజేడు: పూసూరు వద్ద గోదావరి వరద

వాజేడు: గోదావరి వరద నీటిలో మిర్చి చేలు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ములుగు: అర్హులందరికీ విడతల వారీగా సంక్షేమ ఫలాలు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ములుగు అదనపు కలెక్టర్‌ సీహెచ్‌.మహేందర్‌ జీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణిలతో కలిసి మంత్రి సీతక్క యునిఫాంలను అందజేశారు. అంతకు ముందు గిరిజన భవన్‌లో ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్‌వాడీలు, ఆశ వర్కర్ల సమస్యలను విడతల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ పాఠశాలలను మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అదనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు. నూతన పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడానికి సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని వివరించారు. ప్రతి ఒక్కరికీ యునిఫాంలను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ సహకారంతో విజయవంతంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. సోలార్‌ ప్లాంట్లు, ఆటోలు, వాహనాలు, బస్సుల కొనుగోలు కోసం వడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని వివరించారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘం అంటే భరోసా అని, తోటి సభ్యులు కష్టసుఖాల్లో తోడుంటారని వివరించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగాయన్నారు.

మహిళలతో మంత్రి ఆటాపాట

అనంతరం డీఎల్‌ఆర్‌ గార్డెన్‌లో గెజిటెడ్‌ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అంతకుముందు గిరిజన భవన్‌లో మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ఇప్పటికే అర్హులను గుర్తించి పదివేలకు పైగా రేషన్‌ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. నూతన కార్డులను పంపిణీ చేయడమే కాకుండా వారికి సన్న బియ్యం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంటు అందజేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రభుత్వానికి అండగా నిలవాలని సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ తుల రవి, సీడీపీఓ శిరీష, డీసీఎస్‌ఓ ఫైజల్‌ హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల

సమస్యల పరిష్కారానికి కృషి

బతుకమ్మ అంటేనే మహిళల పండుగ

రాష్ట్ర పంచాయతీరాజ్‌,

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

గోదావరి దోబూచులాట 1
1/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 2
2/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 3
3/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 4
4/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 5
5/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 6
6/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 7
7/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 8
8/9

గోదావరి దోబూచులాట

గోదావరి దోబూచులాట 9
9/9

గోదావరి దోబూచులాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement