
పెరుగుతున్న గోదావరి
● ముంపునకు గురైన
వందలాది ఎకరాల మిర్చి పంట
● నీటిలోనే రహదారులు
వాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీ టితో గోదావరి వరద పెరుగుతోంది. దీనికి తోడు మండలంలో గత రెండురోజులుగా కురుస్తున్న వ ర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. మండల పరిధిలోని పేరూరు వద్ద బుధవారం సాయంత్రానికి 16.410 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద పల్లపు ప్రాంతాల గుండా ప్రవహిస్తూ మండల కేంద్రం సమీపంలో కొంగాలవాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చి తోటలను ముంచెత్తింది. దీంతో వందలాది ఎకరాల మిర్చి, వరి పంట నీటిలో మునిగింది. గోదావరి ఇలానే పెరిగితే మిర్చి తోటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
రహదారులను ముంచెత్తిన వరద..
ఉధృతంగా పెరిగిన గోదావరి వరద పలు చోట్ల రహదారులను ముంచెత్తింది. మండలపరిధిలోని వాజేడు– గుమ్మడిదొడ్డి, పూసూరు– ఏడ్జెర్లపల్లి, పేరూరు–కృష్ణాపురం, బొమ్మనపల్లి–ఎడ్జెర్లపల్లి గ్రా మాల మధ్య రహదారుల పైకి చేరింది. దీంతో ఆ యా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలను వరదలోకి వెళ్లకుండా స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేశారు. పలు చోట్ల రహదారులకు అడ్డంగా ట్రాక్టర్లు, కర్రలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు
వాజేడు మండలపరిధిలోని టేకులగూడెం గ్రామ సమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిని గోదావరి వరద ముంచెత్తింది. జాతీయ రహదారి ముంపునకు గురైన విషయం తెలియని వాహన దా రులు అక్కడికి వచ్చారు. రోడ్డు మునిగి ఉండటంతో ఎటు వెళ్లాలో అర్థంకాక అక్కడే ఉన్నారు. ఇందులో రెండు బస్సులు కూడా ఉండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాల్సిన వారికి మరో మార్గాన్ని నిర్ధేశించారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు ఇటుగా వచ్చారు. రేగుమాకు ఒర్రె ద్వారా వచ్చిన గోదావరి వరద నీరు బ్రిడ్జిని ముంచెత్తడంతో రహదారి ముంపునకు గురైంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వరదలోకి ఎవరు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని ఎల్బాక లోలెవల్ కాజ్‌వేపై నుంచి జంపన్నవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా ఎల్బాక కాజ్‌వేపై నుంచి శుక్రవారం వరద భారీగా ప్రవహిస్తుంది. దీంతో పడిగాపూర్, ఎల్బాక గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో..
ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తోంది. కలెక్టర్ దివాకర రామన్నగూడెం గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
వెంకటాపురం(కె): మండలంలో శుక్రవారం గోదావరి వరద పెరుగుతోతోంతోంది. మండల పరిధిలోని మంగపేట గోదావరి లంకల్లోకి వెళ్లే గో దావరి పాయలోకి వరద నీరు చేరింది. దీంతో మి ర్చి తోటల్లో పనుల కోసం వెళ్లిన రైతులు, కూలీలు పడవల సహాయంతో దాటి వెళ్తున్నారు.

పెరుగుతున్న గోదావరి

పెరుగుతున్న గోదావరి