
ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి
● కలెక్టర్ టీఎస్ దివాకర
ములుగు రూరల్: చాకలి ఐలమ్మ పోరాటయోధురాలని, ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంతి వేడుకలను వెనకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐలమ్మ విరోచిత పోరాటం ఎన్నటికీ మరచిపోలేనిదన్నారు. భూ హక్కుల కోసం పోరాడిన తొలి మహిళా యోధురాలన్నారు. ఈ కార్యక్రమంలో వెనకబడి తరగతుల అభివృద్ధి అధికారి సర్ధార్‌సింగ్, మణికంఠ రజక సంఘం, ఐలమ్మ జయంతి నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు నగరపు రమేశ్, పరికిరాల రవి, చాపర్తి రాజు, మహేందర్, అరుణ, జాలిగం శ్రీనివాస్, భిక్షపతి, సదానందం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నేడు, రేపు భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ దివాకర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికలో ఉందని, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఏదైన ప్రమాదాలు సంభవిస్తే 18004257109 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
గోవిందరావుపేట: ప్రతీ పౌరుడు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ అదనపు కమాండెంట్ సీతారామ్ అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలోని 5వ బెటాలియన్‌లో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అణ గారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ అనిల్ కుమార్, ఆర్‌ఐలు స్వామి, భాస్కర్, వెంకటేశ్వర్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి