రిజర్వేషన్లు ఖరారు | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు ఖరారు

Sep 28 2025 6:57 AM | Updated on Sep 28 2025 6:57 AM

రిజర్వేషన్లు ఖరారు

రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలో పదేసి జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు

ములుగు రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్‌ టీఎస్‌.దివాకర తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్లు సంపత్‌రావు, మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీరాజ్‌శాఖ అధికారుల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి ప్రకారం నిర్వహించగా రాజకీయ కులగణన (ఎస్‌ఈఈఈపీసీ) ప్రకారం బీసీల రిజర్వేషన్లు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎస్టీ మహిళకు కేటాయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 10 జెడ్పీటీసీ, 10 ఎంపీపీ స్థానాలతో పాటు ఎంపీటీసీలు 83, సర్పంచ్‌లు 171 స్థానాలతో పాటు వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు.

అశా వహుల్లో నిరుత్సాహం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో పాల్గొనాలని వేచి చూస్తున్న వారి ఆశలు అడి ఆశలయ్యాయి. గతంలో ఉన్న రిజర్వేషన్ల ఆధారంగా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయని గంపెడాశతో ఉన్న స్థానిక నాయకులు కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన రిజర్వేషన్ల ప్రక్రియకు హాజరయ్యారు. డ్రా పద్ధతిన ప్రక్రియ నిర్వహించిన రిజర్వేషన్ల ఖరారు ప్రతికూలంగా రావడంతో పలువురు ఆశా వహులు నిరుత్సాహంతో వెనుతిరిగారు.

జెడ్పీపీఠం ఎస్టీ మహిళకు ఖరారు..

ములుగు జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం ఎస్టీ మహిళకు ఖరారు చేశారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్‌, రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ డైరెక్టర్‌, రాష్ట్ర ఎన్నికల అథారిటీ శ్రీజాన గెజిట్‌ విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ యాక్ట్‌ 2018, జీఓ ఎంఎస్‌ నంబర్‌ 41 నిబంధనల మేరకు రిజర్వేషన్‌ ఖరారు చేసినట్లు ప్రకటించారు.

మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలు

మండలం జెడ్పీటీసీ ఎంపీపీ

ములుగు ఎస్టీ జనరల్‌ ఎస్టీ మహిళ

మల్లంపల్లి బీసీ మహిళ బీసీ మహిళ

వెంకటాపురం(ఎం) ఎస్సీ జనరల్‌ ఓసీ జనరల్‌

గోవిందరావుపేట బీసీ మహిళ బీసీ మహిళ

ఎస్‌ఎస్‌ తాడ్వాయి బీసీ జనరల్‌ బీసీ జనరల్‌

ఏటూరునాగారం ఎస్టీ జనరల్‌ ఎస్సీ జనరల్‌

కన్నాయిగూడెం ఎస్టీ మహిళ ఎస్టీ మహిళ

మంగపేట జనరల్‌ మహిళ –––

వాజేడు బీసీ జనరల్‌ బీసీ మహిళ

వెంకటాపురం(కె) ఎస్సీ మహిళ ఎస్టీ మహిళ

మంగపేట మండలం ఎంపీపీ స్థానం

రిజర్వేషన్‌ ఖరారు చేయలేదు.

లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపు

ఆశావహుల్లో నిరుత్సాహం

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎస్టీ మహిళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement