
పౌష్టికాహారం అందించాలి
● జిల్లా సంక్షేమాధికారి
తుల రవి
ములుగు రూరల్: బాలసదనంలో ఆశ్రయం పొందిన బాలికలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలసదనంలోని బాలలకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు కల్పించాలని సూచించారు. బాలల నెలవారీ పరిశీలన పత్రాలను తప్పకుండా తయారు చేసుకోవాలన్నారు. అనంతరం బాలికలతో బాలసదనంలో అందుతున్న సౌకర్యాలు, భోజనం వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. బాలల ఎత్తు, బరువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శిరీష, సూపర్‌వైజర్ కావ్య, డీసీపీఓ ఓంకార్, ఐటీ కోఆర్డినేటర్ మహేశ్, సూపరింటెండెంట్ శ్యామల, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్య పాల్గొన్నారు.