
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గుణపాఠం చెప్పాలి
వెంకటాపురం(ఎం): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ బీజేపీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, ఆరు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. అధికారం కోసం మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్నాయని వివరించారు. కేవలం బీజేపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న గరీబ్ కల్యాణ్ యోజన, ఉజ్వల్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, కారుపోతుల యాదగిరి, కొత్త సురేందర్, భూక్య జవహర్‌లాల్, కృష్ణాకర్‌రావు, రవీంద్రాచారి, రవీందర్‌రెడ్డి, రమేష్, ఇమ్మడి రాకేష్, మల్లేష్, తిరుపతిరెడ్డి, విశ్వనాథ్, రెడ్డి శ్రీనివాస్, గంగుల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి