మహాసభలను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహాసభలను జయప్రదం చేయాలి

Aug 4 2025 4:20 AM | Updated on Aug 4 2025 4:36 AM

మహాసభలను జయప్రదం చేయాలి

మహాసభలను జయప్రదం చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు

ములుగు రూరల్‌: రేపు జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించబోయే సీపీఐ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులాలు మతాల పేరుతో గొడవలు సృష్టిస్తుందని వివరించారు. మతతత్వవాదులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపాల రవీందర్‌, అంజద్‌ పాషా, అచంటి ప్రసాద్‌, ముత్యాల రాజు, కొమురయ్య, రవి, గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement