టేకుకలప స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

టేకుకలప స్వాధీనం

Aug 4 2025 4:20 AM | Updated on Aug 4 2025 4:36 AM

టేకుకలప స్వాధీనం

టేకుకలప స్వాధీనం

వెంకటాపురం(కె): మండలం నుంచి రెండు వాహనాల్లో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న టేకుకలపను స్వాధీనం చేసుకున్నట్లు మండల అటవీశాఖ అధికారి వంశీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు. రెండు పికప్‌ వాహనాల్లో అక్రమంగా టేకుకలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఒక వాహనాన్ని, వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో మరో వాహనాన్ని అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు వాహనాల్లో 16 టేకు మొద్దులు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారుగా రూ.4లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టేకు కలప, వాహనాలను అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement