సంపూర్ణత అభియాన్‌ అవార్డు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణత అభియాన్‌ అవార్డు ప్రదానం

Aug 3 2025 8:30 AM | Updated on Aug 3 2025 8:30 AM

సంపూర

సంపూర్ణత అభియాన్‌ అవార్డు ప్రదానం

ములుగు రూరల్‌: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సంపూర్ణత అభియాన్‌ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై న విషయం విదితమే. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా కలెక్టర్‌ టీఎస్‌.దివాకర అవార్డు అందుకున్నారు. కన్నాయిగూడెం బ్లాక్‌లో కీలక పనితీరు, సూచికల పనితీరు బాగుండడంతో అవార్డు లభించిందని కలెక్టర్‌ తెలిపారు.

‘దివ్యాంగులకు

ఇంటి వద్దే విద్య’

ఏటూరునాగారం: అంగవైకల్యం, ఇతర లోపాలు కలిగిన దివ్యాంగులు విద్యకు దూరం కాకుండా విద్య అభ్యసించే విధంగా శ్రీఇంటి వద్ద విద్యశ్రీ కార్యక్రమాన్ని భవిత సెంటర్‌ల ద్వారా చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్‌ అర్షం రాజు, భవిత సెంటర్ల జిల్లా కో ఆర్డినేటర్‌ సాంబయ్య, ఎంఈఓ మల్లయ్య తెలిపారు. మండల పరిధిలోని రాంపూర్‌లో దివ్యాంగుడు తోలెం జీవన్‌కు హోమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ కిట్లను శనివారం వారు అందజేసి మాట్లాడారు. దివ్యాంగులు ఇంటి వద్దనే విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కిట్లను పంపిణీ చేస్తుందన్నారు. ప్రత్యేక పరికరాలు కిట్లలో అందుబాటులో ఉంటాయని, వాటి ద్వారా ఐఈఆర్పీలు చదువు నేర్పుతారని వెల్లడించారు. బడికి దూరమైన దివ్యాంగులను గుర్తించి వారికి ఈ కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు స్వరూప, రమేష్‌లతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే బీజేపీ లక్ష్యం

ములుగు రూరల్‌: రైతుల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆ పార్టీజిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా 20వ విడత రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేశారని వెల్లడించారు. ఈ డబ్బులు రైతుల పంటలకు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు రేష్మా ఎంపిక

వెంకటాపురం(ఎం): మండలంలోని మైనార్టీ కళాశాలకు చెందిన ఎస్‌కే. రేష్మా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ వందన, పీఈడీ నవ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జాకారంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ అండర్‌–16 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో రేష్మా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. అదే విధంగా నేడు, రేపు హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో రేష్మా పాల్గొననున్నట్లు వారు వెల్లడించారు.

కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

ములుగు రూరల్‌: వెంకటాపురం(కె) మండలం మర్రిగూడెం గ్రామ పంచాయతీ కార్మికుడు మడకం విజయ్‌ ఇటీవల విద్యుదాఘాతంతో మృత్యువాత పడిన అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విజయ్‌ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలన్నారు. పంచాయతీ కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి దావుద్‌, రఘుపతి, మల్లారెడ్డి, హుస్సేన్‌, సమ్మక్క, సరోజన, నీలాదేవి, సరిత, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంపూర్ణత అభియాన్‌ అవార్డు ప్రదానం
1
1/2

సంపూర్ణత అభియాన్‌ అవార్డు ప్రదానం

సంపూర్ణత అభియాన్‌ అవార్డు ప్రదానం
2
2/2

సంపూర్ణత అభియాన్‌ అవార్డు ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement