
జనసురక్ష పథకంపై అవగాహన పెంచుకోవాలి
● లీడ్ బ్యాంకు మేనేజర్ జయప్రకాశ్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జన సురక్ష పథకంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్ జయప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఆర్‌బీఐ సౌజన్యంతో ఎస్‌బీఐ సహకారంతో వీడ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షర్యాసతపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జన సురక్ష పథకంతో పాటు పీఎం ఎస్‌బీవై, పీఎం జేజేపీవై ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌బీఐ బ్యాంక్ ఇన్సూరెన్స్, స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుమనవాణి, ఏఓ కుమార్‌యాదవ్, ఎంపీఓ శ్రీధర్‌రావు, ఏఈఓ దుర్గప్రసాద్, సీఎఫ్ కౌన్సిలర్ భాస్కర్, అనిల్, జానపాల్‌రాజ్ పాల్గొన్నారు.