
ఇళ్ల స్థలాలకు భూ పరిశీలన
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి గ్రామంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ నివాస గృహాలను ఏర్పాటు చేసేందుకు ఇళ్ల స్థలాల కోసం భూమిని గురువారం అదనపు కలెక్టర్ మహేందర్‌జీ పరిశీలించారు. ఈ మేరకు దొడ్ల, కొత్తూరు, ఊరట్టం ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించి అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. అయితే ఈ రెండు ప్రాంతాల్లో కూడా కొంత రిజర్వు ఫారెస్ట్, రెవెన్యూ భూమి ఉండడంతో క్లియరెన్స్ కోసం సంయుక్త శాఖల ద్వారా సర్వేలు చేయించాల్సి ఉందని అధికారులు అదనపు కలెక్టర్‌కు తెలిపారు. అంతేకాకుండా అటవీశాఖ భూమికి బదులుగా మరో చోట భూమి ఇస్తే అనుమతులు వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు మహేందర్‌జీకి వివరించారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదికస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీశ్వర్, మాజీ సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్, పంచాయతీ కార్యదర్శి సతీష్, తదితరులు పాల్గొన్నారు.