
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన ప్రతిఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుందన్నారు. జిల్లాలో 5వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలోని నిరుపేదల సంక్షేమానికి మంత్రి సీతక్క ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలపై మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతనిప్పుల భిక్షపతి, మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్