
ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై వ్యాపారులు ప్రజలకు రవాణా ఇబ్బందులు కలిగించే విధంగా వ్యాపారాలు కొనసాగించడం సరికాదని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పత్తిపల్లిరోడ్డు, ఆస్పత్రి పరిసరాల్లో వ్యాపారా సముదాయాలను ఆయన బుధవా రం సందర్శించారు. వ్యాపారాలు కొనసాగించే విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. రోడ్డు పక్కన ప్రజలు నడిచే ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించాలని యజమానులకు సూచించారు. లేని పక్షంలో దుకా ణాదారులకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ సంపత్