
అసంక్రమిత వ్యాధులపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం: అసంక్రమిత వ్యాధులపై దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసంక్రమిత నియంత్రణ విభాగంలోని రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలన్నారు. కేన్సర్ రోగులలో బ్రెస్ట్, సర్వైకల్ కేన్సర్ రోగులకు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయాలని తెలిపారు. వివరాలను ఎన్‌సీడీ పోర్టల్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. టైపు–1 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వాలని తెలిపారు. నాలుగో విడత అసంక్రమిత వ్యాధుల నియంత్రణ స్క్రీనింగ్ పరీక్షలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు