
మహితాపురం జలపాతం సందర్శన
వెంకటాపురం(కె): మండల పరిధిలోని మహితాపురం జలపాతాన్ని వెంకటాపురం, వాజేడు మండలాల ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జలపాతం వద్ద అటవీశాఖ సిబ్బంది విధుల వివరాలపై ఆరా తీశారు. జలపాతానికి రావడానికి అడవిలో అనేక మార్గలు ఉన్నాయని దీంతో సందర్శకులను జలపాతం వద్దకు రాకుండా నిలువరించలేకపోతున్నామని వివరించారు. ఈ విషయంపై స్పందించిన ఆయన జలపాతం వద్దకు రాకుండా గ్రామాల్లోని ఉమ్మడి పాయింట్ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులను నియంత్రించడానికి పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు.