
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ములుగు రూరల్: మధ్యాహ్న భోజన కార్మికులు తమ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సోమవారం డీఈఓ చంద్రకళకు, కలెక్టరేట్‌లో వినతి పత్రాలను సీఐటీయూ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ 9నెలలుగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. కట్టెల పొయ్యి స్థానంలో గ్యాస్ సిలెండర్లను మంజూరు చేయాలన్నారు. పెరిగిన మెస్ చార్జీల ప్రకారం బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, రాజకుమారి, సవరూప, కమల, రాధ తదితరులు ఉన్నారు.
దివ్యాంగులకు ఇచ్చిన
హామీలు అమలు చేయాలి
ములుగు రూరల్: ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యామ్‌బాబు అన్నారు. ఎంఎస్‌పీ ముఖ్యకార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పింఛన్ రూ.6వేలు, వితంతువుల పింఛన్ రూ.4వేలు తక్షణమే బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల 13న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన దివ్యాంగుల సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్, రమేష్, రవీందర్, జాషువా, నరేష్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌ను కలిసిన రైస్‌మిల్లర్లు
ములుగు రూరల్: ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికై న కల్యాణిని సోమవారం రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోషియేషన్ సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట పీఏసీఎస్ చైర్మన్ ఎల్లారెడ్డి, ఎలగందల మోహన్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత
తప్పనిసరి
ములుగు రూరల్: విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రీయ బాలల సంరక్షణ కేంద్రం డాక్టర్ మల్లికార్జున్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మాదవరావుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. విద్యార్థినుల కు పౌష్టికాహారం అందించాలని సూచించారు.

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి