
బాలల భవితకు భరోసా
ఫలితాలిస్తున్న ఆపరేషన్ ముస్కాన్
● ప్రతిఏటా జనవరి, జూలైలో అధికారుల తనిఖీలు
● 2019 నుంచి 850 మంది చిన్నారులకు విముక్తి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో చదువు మానేసి బాల కార్మికులుగా మారిన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నిరుపేద కుటుంబాలలో పిల్లలు హోటళ్లు, కిరాణం దుకాణాలు, ఇటుక బట్టీలలో, బైక్ మెకానిక్‌ల వద్ద పనులు చేస్తున్న బాల కార్మికులను గుర్తించి వెట్టిచాకిరి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు ప్రతిఏటా అధికారులు జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా శిశు సంక్షేమ, పోలీస్ శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూ 18ఏళ్ల లోపు వయస్సు కలి గిన పిల్లలను, చదువు మానేసి కార్మికులుగా మారిన వారి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న బాల కార్మికుల పరిస్థితులను బట్టి వారికి అందుబాటులో ఉండే పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి చదువు చెప్పిస్తున్నారు.
2019 నుంచి గుర్తించిన బాల కార్మికుల వివరాలు
సంవత్సరం మాసం గుర్తించిన
బాలకార్మికులు
2019 జనవరి 19
జూలై 58
2020 జనవరి 138
జూలై 30
2021 జనవరి 190
జూలై 47
2022 జనవరి 129
జూలై 30
2023 జనవరి 32
జూలై 32
2024 జనవరి 63
జూలై 33
2025 జనవరి 47
జూలై 02