
కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: కాంగ్రెస్ పాలనలోనే పేదలకు తగిన న్యాయం జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మేడారంలో పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మండల ఉపాధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాపోలు సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం నార్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మేడారం జంపన్నవాగు వద్ద టూరిజం పర్యాటకంగా తీర్చిదిద్దుతమని చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లోని యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇస్రం దయాకర్, కొడిశాల నవీన్, జీడీ అనిల్, గంధం రమేష్, తాలూకా వెంకన్న, మిరియాల తిరుపతి, దోమల రాజు కుమార్, నాగల్లి కుమార్, కన్నెబోయిన మహేష్, చీమల నితిన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చర్ప రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేడారంలోని ఊరట్టం స్తూపం వద్ద నూతనంగా నిర్మించిన కాక సారయ్య పెట్రోల్ బంక్ సమ్మక్క– సారలమ్మ కోమలి ఫిల్లింగ్ సేషన్‌ను బంక్ యజమాని, సారలమ్మ పూజారి కాక సారయ్య, బంక్ మేనేజర్ ఽశ్రీధర్ కిరణ్‌లతో కలిసి మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించి పలు సూచనలు చేశారు.
నాటువేసే కూలీలకు ‘రెయిన్’ కవర్లు
ములుగు రూరల్: వరినాట్లు వేస్తున్న కూలీలకు మంత్రి సీతక్క అందించారు. ఆదివారం తాడ్వాయి మండల పర్యటన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ సమీపంలో కూ లీలు నాట్లు వేస్తుండగా వెళ్లి వారిని అప్యాయంగా పలకరించారు. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం కూలీలకు రెయిన్ కవర్లను అందించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క

కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం