
జలపాతాల సందర్శన నిలిపివేత
ములుగు రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని జలపాతాల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లాలోని బొగత, ముత్యంధార, కొంగల, మామిడిలొద్ది జలపాతాలకు పర్యాటకులు వెళ్లకూడదని సూచించారు. జలపాతాల వద్ద వరద ఉధృతి కారణంగా భద్రత దృష్ట్యా సందర్శనను నిలిపి వేసినట్లు తెలి పారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘిస్తే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని వివరించారు.వర్షాల దృష్టా తక్షణ సహా యం కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004257109లో సంప్రదించాలని సూచించారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లో అధికారులు అందుబాటులో ఉంటారనిని వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ఉధృతి ఎక్కువైతే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పర్యాటకులు సహకరించాలని అన్నారు. వరదల కారణంగా ప్రాణనష్టం జరుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.