
గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు
● ఎస్పీ శబరీశ్
వెంకటాపురం(ఎం): గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలతో పాటు రిసెప్షన్ సెంటర్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ అనంతరం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 5 ఎస్ విధానం అమలుపై తెలుసుకున్నారు. ప్రతీ వర్టికల్‌కు ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు రికార్డు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. అనంతరం విచారణలో ఉన్న కేసులను, కంప్యూటర్ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. మిస్సింగ్ కేసుల విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పని పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, ములుగు సీఐ సురేష్, ములుగు ఎస్‌హెచ్‌ఓ రాజు తదితరులు ఉన్నారు.