
రెండు ఫొటోలు దిగితేనే వేతనం
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025
పర్యవేక్షణ కట్టుదిట్టం
ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతిరోజూ జిల్లాలోని 174 పంచాయతీల్లో సెక్రటరీలు వెరిఫై చేసి రిపోర్ట్‌ను ఎంపీడీఓలకు పంపించాల్సి ఉంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20శాతం ఫొటోలు లేదంటే గ్రామానికి రెండు ఫొటోల చొప్పున ఎంపీడీఓ ఆఫీస్‌లోని ఏపీఓ, కాంట్రాక్ట్ స్టాఫ్, పర్మనెంట్ స్టాఫ్ అదే రోజు వెరిఫై చేసి రిపోర్ట్‌ను కలెక్టర్, డీఆర్‌డీఓకు పంపించాలి. జిల్లా స్థాయిలో ముందు రోజు క్యాప్చర్ చేసిన ఫొటోల్లో కనీసం 30 ఫొటోలను కలెక్టర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. డీఆర్‌డీఏ కాంట్రాక్ట్, పర్మనెంట్ స్టాఫ్ ఒక్కొక్కరు జిల్లా వ్యాప్తంగా వచ్చిన మొత్తం ఫొటోల్లో రోజుకు 10శాతం లేదా 200 ఫొటోలను వెరిఫై చేయాలి. అలాగే గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ రోజు కు 20 ఫొటోలను వెరిఫై చేయాల్సి ఉంటుందని సూచించారు.
ఏటూరునాగారం: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శ్రామికుల డబ్బులు దోచుకోవడం, మరికొందరు పనికి రాకున్నా అటెండెన్స్ వేయించుకుంటున్నారు. దీంతో ఇకపై పనిచేసే చోట కూలీలకు రెండుసార్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపాధి హామీ కూలీల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీలో పనిచేసేందుకు వచ్చిన కూలీల ఫొటోలను రెండు పూటలా తీయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని 9మండలాల పరిధిలో గల అధికారులు ఈ నెల 14 నుంచి గ్రామాల వారీగా శాంపిళ్లను తీస్తున్నారు.
కొత్త అంశాలివే..
ఫొటోల వెరిఫికేషన్ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మేట్, ఫీల్డ్ అసిస్టెంట్‌కు సంబంధం లేని ఫొటోని అప్‌లోడ్ చేశారా.. పని ప్రదేశంలో లైవ్ ఫొటో కాకుండా పాత ఫొటోను అప్‌లోడ్ చేశారా.. ఫొటోలో ఉన్న వ్యక్తుల సంఖ్య, మస్టర్‌లో హాజరైన వ్యక్తుల సంఖ్యలో తేడా ఉందా అన్న వివరాలు గమనించాలని సూచించింది. అలాగే ఫొటోల్లో ఉన్న సీ్త్ర, పురుషుల సంఖ్య, మస్టర్‌లో హాజరైన సంఖ్యతో సమానంగా ఉందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వేర్వేరు మస్టర్‌లలో ఒకే వ్యక్తులను క్యాప్చర్ చేశారా అనే వివరాలను వెరిఫై చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఫీల్డ్ అసిస్టెంట్లకు షరతులు
వర్క్ సాంక్షన్ లేనిది ఏ పని కూడా స్టార్ట్ చేయొద్దు. డిమాండ్ చేసి మస్టర్ మేట్‌కు ఇచ్చిన తర్వాతనే పని ప్రారంభించాలి. ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌కు రెండు, మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఒకే గ్రామ పంచాయతీలో పని ప్రారంభించాలి. వర్క్‌సాంక్షన్ లేకుండా పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిగే నష్టం ఏమిటంటే ఒక వేళ ప్రమాదవశాత్తు ఎవరికై నా పనిప్రదేశంలో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు.
రెండు ఫొటోలు తీయాలి
కూలీలు పనులు చేసే ప్రదేశంలో ఉదయం, సా యంత్రం రెండు వేళల్లో రెండు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్పుడే వారికి వేతనం వస్తుంది. ఫొటో ఉంటే హాజరు ఉన్నట్లుగా పరిగణలోకి తీసుకుంటారు. ఫొటోలు అప్‌లోడ్ చేయకపోతే వేతనం కూలీలకు వచ్చే అవకాశం లేదు. ఈజీఎస్‌లో అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
– చరణ్, ఈజీఎస్ ఏపీఓ, ఏటూరునాగారం
న్యూస్‌రీల్
అర్హులందరికీ రేషన్‌కార్డులు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణావృద్ధిశాఖ
ఒక ఫొటో తీస్తే సగం కూలి వర్తిస్తుందని స్పష్టం చేసిన కేంద్రం
14 నుంచి అన్ని స్థాయిల్లో శాంపిల్‌గా ఫొటోల పరిశీలన

రెండు ఫొటోలు దిగితేనే వేతనం

రెండు ఫొటోలు దిగితేనే వేతనం

రెండు ఫొటోలు దిగితేనే వేతనం