
ఏజెన్సీలో భారీవర్షం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో గోదావరి, వాగులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు అలర్ట్ చేశారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వాగుల వద్ద సిబ్బంది గస్తీ ఉండే విధంగా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా గత నెల నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వాగులు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండే విధంగా సూచనలు, సహాయక చర్యలును చేపట్టారు. పోలీసులు, రెవెన్యూ, ఐటీడీఏ, గ్రామ పంచాయతీల అధికారులు, సిబ్బంది వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు 24గంటలు మానిటరింగ్ చేసేవిధంగా కలెక్టర్ దివాకర ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మంగళవారం ఉదయం కొండాయి వద్ద కురిసిన వర్షానికి మట్టిరోడ్డు బురదరోడ్డుగా మారింది. దీంతో ప్రజలు నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఏజెన్సీలో భారీవర్షం