
రోడ్లపైనే వారాంతపు సంతలు
వాజేడు : మండలంలో వార సంతలు (అంగళ్లు) రహదారులపైనే నిర్వహిస్తున్నారు. ప్రజలు కూరగాయలు, నిత్యావసర వస్తువులను వారానికి సరిపడే అన్ని సరుకులు సంతలోనే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకుంటారు. అలాంటి సంతల నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో రహదారులపైనే కొనసాగుతున్నాయి. మండలంలోని వాజేడు, పెద్దగొళ్లగూడెం, జగన్నాథపురం, గుమ్మడిదొడ్డి, పేరూరు గ్రామాల్లో వార సంతలను నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో ఊరిలో ఈ సంతలు నిర్వహిస్తుండడంతో ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు సంతకు వచ్చి సరుకులను కొనుగోలు చేసుకొని వెళ్తారు.
తప్పని తిప్పలు
వారం వారం నిర్వహించే సంతకు వ్యాపారం చేసుకోవడానికి వచ్చే చిరు వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. సంత నిర్వహణకు సరైన స్థలం లేకపోవడంతో రహదారులకు ఇరువైపులా సరుకులను విక్రయిస్తున్నారు. సంత నిర్వహించే సమయంలో ప్రజలు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఇ బ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే వారు తెచ్చిన సరుకులు తడువకుండా భద్రపర్చలేక నష్టపోతున్నారు. గాలులు వీచిన సమయంలో వస్తువులు చె ల్లాచెదురు కాకుండా రక్షించుకోవడం తలకుమించిన భారం అవుతోంది. తమకు ప్రత్యేకంగా ఒక స్థ లం కేటాయించి వ్యాపార సముదాయాలను నిర్మించి ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
లైట్ల వెలుతురులోనే వ్యాపారం
మండలం ఏజెన్సీ ప్రాంతం కావడంతో సంతల్లో వ్యాపారం సాయంత్రం సమయంలో నిర్వహిస్తా రు. చాలా మంది కూలీ పనులకు వెళ్లి వచ్చిన త ర్వాత సంతకు వస్తుంటారు. మండలంలోని సంతల్లో సాయంత్రం 5 గంటల తర్వాత వ్యాపారాల నిర్వహణ కొనసాగుతోంది. రాత్రి 8 గంటలు దాటే వరకు కూడా ప్రజలు కూరగాయలు, సామగ్రిని కొ నుగోలు చేస్తారు. ఆ సమయంలో వీధిలైట్ల వెలుతురులో వ్యాపార నిర్వహణ కొనసాగుతుంది. ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడితే సెల్ లైట్ల వెలుతురులో వ్యాపారాలు సాగుతాయి. అధికారులు స్పందించి సంతల నిర్వహణకు స్థలాలు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న
వాహనదారులు, ప్రజలు
పట్టించుకోని అధికారులు

రోడ్లపైనే వారాంతపు సంతలు