
స్పెషల్ సర్వీస్‌లు నిరంతరం నడిపించాలి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఫుష్కరఘాట్ వరకు ఏర్పాటు చేసిన స్పెషల్ సర్వీస్‌లను నిరంతరం నడిపించాలని భూపాలపల్లి ఆర్డీఓ రవి ఆదేశించారు. బస్టాండ్ ఆవరణలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు స్పెషల్ సర్వీస్ బస్సుల నిర్వహణను ఆర్డీఓ శుక్రవారం పరిశీలించారు. బస్సులు నడపకుండా బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉంచడంతో డ్రైవర్లపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి అధికారులతో మాట్లాడి సర్వీస్‌లను నిరంతరం నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులను ఆదేశించారు.