
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని రాష్ట్ర పరిశీలకులు, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. జిల్లాలో 20వ తేదీ నుంచి రెండో దశ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు జవహర్‌నగర్ మోడల్ స్కూల్, చల్వాయి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సోమిరెడ్డి శిక్షణ శిబిరాలను పరిశీలించి మాట్లాడారు. ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని 2025–26 విద్యా సంవత్సరంలో బడి బాట ద్వారా విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు, సమాజానికి నమ్మకం పెంచాలన్నారు. ఈ మేరకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, కోర్స్ కో ఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, సెంటర్ ఇన్‌చార్జ్‌లు సూర్యనారాయణ, అర్షం రాజు, గుల్లపల్లి సాంబయ్య, అప్పని జయదేవ్, మండల విద్యాశాఖ అధికారులు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పరిశీలకులు, ఓపెన్ స్కూల్
జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి