
పోచాపూర్ రోడ్డు విస్తరించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: కొడిశాల నుంచి పోచాపూర్ వరకు నిర్మిస్తున్న రోడ్డును నాలుగు మీటర్ల వెడల్పు విస్తరించాలని పోచాపూర్, బంధాల గ్రామాల్లోని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రోడ్డును పరిశీలించిన గ్రామస్తులు విలేకర్లతో మాట్లాడారు. కొడిశాల నుంచి పోచాపూర్ వరకు మూడు మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయడంతో ఎదురెదురుగా వచ్చే రెండు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. రోడ్డు మూడు మీటర్లు నిర్మించడంతో ఇరుకుగా ఉందన్నారు. అదే రోడ్డును నాలుగు మీటర్ల వెడల్పు చేయాలని మంత్రి సీతక్క దృష్టికి గతంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. నాలుగు మీటర్ల రోడ్డు వేయడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నా అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మూడు మీటర్లకే పరిమితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోలెం ఆశోక్, నర్సయ్య, అలెం పెద్ద బాలయ్య, కొమురం మహేశ్, లక్ష్మయ్య, యాప శ్రీకాంత్, ఈసం స్వామి, నాలి శ్రావణ్, కోరం లక్ష్మయ్య, రంజిత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.