
ఆధార్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ములుగు: పీహెచ్‌సీలకు వచ్చే వ్యాధిగ్రస్తులు ఆధార్ కార్డుతో రావాలని, వారి వివరాలను నూతన పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వైద్యాధికారిని సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరా వు తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులతో నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్స్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈహెచ్‌ఎంఐఎస్ అనే కొత్త పోర్టల్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. పీహెచ్‌సీ లకు వైద్యం కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు మొదట రి జిస్ట్రేషన్ నమోదు చేసుకుని వైద్యాధికారిని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. వైద్యాధికారులు పీహెచ్‌సీకి వచ్చే వ్యాధిగ్రస్తులకు ఆధార్‌కార్డులతో వచ్చేవిధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం డాటా ఎంట్రీ ఆపరేటర్స్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.