
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
● దైత అమ్మవారికి తిరుమంజనం
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో (జాతర) రెండోరోజు గరుడాదివాసం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారికి తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణతో కుంకుమ, చందనం, జలం, పాలతో అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సాయంత్రం యాగశాలలో గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 నుంచి గరుడపఠ లేకనం లిఖించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై టీవీఆర్ సూరి, ఆలయ బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్, అర్చకులు ముక్కామల శేఖర్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఈ శ్వర్‌చంద్‌రామానుజం, యాగ్నికుల బృందం అమరవాది రామనర్సింహచార్యులు, పి. మధన మోహనాచార్యులు, మణిదీపాచార్యులు, అభిరామాచా ర్యులు, శ్రీమాన్ రామచంద్రాచార్యులు, ఆలయ సీ నియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది అజయ్, నవీన్, గణేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.