
మళ్లీ అదే పరిస్థితి
మంగపేట: మండలంలోని చుంచుపల్లి, వాడగూడెం గ్రామాల మధ్య ఏటూరునాగారం –బూర్గం పాడు ప్రధాన రోడ్డుపై శుక్రవారం రాత్రి 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రధా న రోడ్డుపై వచ్చి పోయే వందలాది ఇసుకలారీలు, బస్సులు, కార్లు, ఆటోలు గంటన్నర పాటు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పాలాయిగూడెం వద్ద గోదావరి నుంచి టిప్పర్లతో ఇసుకను తీసుకువచ్చి ప్రధాన రోడ్డుకు ఇరువైపుల స్టాక్ చేస్తున్నారు. పట్టా ల్యాండ్ నుంచి వచ్చే ఇసుకలారీలు సైతం రోడ్డు దాటే క్ర మంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సమస్యను పట్టించుకునే వారు లేకపోవడంతో ఇసుక క్వారీల నిర్వాహకులు స్వలాభం కోసం ప్రజలు, ప్రయాణికులు వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మంగపేట, మల్లూరు, వాడగూడెం ఇసుకక్వారీల నుంచి వెళ్లే లారీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చే ఇసుకలారీలు వేబ్రిడ్జిల వద్ద నిలపడంతో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా తయారైంది. అయిన ఏ ఒక్క అధికారి సమస్యను పట్టించుకోక పోవడంతో ప్రజలు మండిపడుతున్నారు.
చుంచుపల్లిలో ట్రాఫిక్ జామ్
గంటన్నర పాటు ప్రయాణికుల
ఇబ్బందులు