
అధికారులు పట్టించుకోలేదు..
దాతలు తమకు ఇచ్చిన భూమిలో మరొకరు ఇష్టానుసారంగా ఇంటి నంబర్ తీసుకొని అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్ వాసులు ఆరోపించారు. గతంలో ఇళ్లు లేదని ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నట్లు తెలిపారు. సల్లగొండ రామచంద్రారెడ్డి ఇచ్చిన భూమిని తన ముగ్గురు కొడుకుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. రికార్డులు తీసి అర్హులకు న్యాయం చేయాలని గత ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడే ఉన్న డీపీఓను పిలిపించి ఈ భూమిలో ఇల్లు ఉందా.. ఖాళీ ప్రదేశానికి ఇంటి నంబర్ కేటాయించారా తెలుసుకొని రిపోర్ట్ అందించాలని ఆదేశించారు.