
మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో బూత్ కమిటీల్లో శక్తికేంద్రాల ఇన్‌చార్జ్‌లను 10 రోజుల్లో నియమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా బూత్ కమిటీలు ప్రతీ ఇంటికి కేంద్ర పథకాలను తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కృష్ణగౌడ్, రమేష్, భూక్య రాజునాయక్, జవహర్ లాల్, ఉత్తమ్‌కుమార్, భిక్షపతి, రవీందర్, వాసుదేవరెడ్డి, సురేష్, పరమేశ్వర్, యాకూబ్ పాషా, జ్యోతి పాల్గొన్నారు.