నిండు గర్భిణిగా కనిపించనున్న నా సామిరంగ బ్యూటీ! | Sakshi
Sakshi News home page

Mirnaa: ఏడు నెలల గర్భిణిగా నా సామిరంగ బ్యూటీ.. నెలరోజుల్లోనే..

Published Wed, Jan 24 2024 9:45 AM

Vikram Sreedharan About Mirna Menon Birthmark Movie - Sakshi

హీరోయిన్లకు బలమైన పాత్రలు అరుదుగానే లభిస్తుంటాయి. అలా జైలర్‌ చిత్రం ఫేమ్‌ మీర్నా మీనన్‌కు బర్త్‌మార్క్‌ అనే లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం లభించింది. విక్రమ్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రచన, నిర్మాత బాధ్యతలను శ్రీరామ్‌ శివరామన్‌, విక్రమ్‌ శ్రీధరన్‌ నిర్వహిస్తున్నారు. సబీర్‌ కల్ల రక్కల్‌, ఇంద్రజిత్‌, ఫోర్‌కొడి, బి ఆర్‌ వరలక్ష్మి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని, ఉదయ్‌ తంగవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు.

డైరెక్టర్‌ ఈ సినిమా విశేషాలను గురించి తెలుపుతూ.. ఇది జెనీ అనే యువతి చుట్టూ తిరిగే కథా చిత్రమని చెప్పారు. ఇందులో ఏడు నెలల గర్భిణి పాత్రలో మిర్నా అద్భుతంగా నటించారన్నారు. చిత్రంలో చాలా కీలకమైన ఈ పాత్రలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో ఈమె పేరు పరిశీలనకు వచ్చిందన్నారు. ఆమె ఆ పాత్రకు కరెక్ట్‌గా నప్పుతారని భావించినట్లు చెప్పారు. కథను అర్థం చేసుకుని జెనీ పాత్రలో ఆమె జీవించారన్నారు. ఈ పాత్రకు ఆమెను మినహా వేరే ఎవరినీ ఊహించలేమన్నారు.

మిర్నా మీనన్‌ ఇంతకుముందు మలయాళంలో బిగ్‌ బ్రదర్‌, తమిళంలో బుర్ఖా, జైలర్‌, తెలుగులో నా సామిరంగ చిత్రాలలో నటించారని.. వాటన్నింటికంటే పూర్తిభిన్నంగా బర్త్‌మార్క్‌ చిత్రంలో ఆమెను చూస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం మిర్నా మీనన్‌ ఎంతగానో శ్రమించారని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను 36 రోజుల్లో పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు.

చదవండి: ఆస్కార్‌ అవార్డ్స్ వేడుక.. ఈ ఏడాది పోటీపడుతున్న సినిమాలివే!

Advertisement
 
Advertisement